గోదావరిలో పెరిగిన నీటి ప్రవాహం

నవతెలంగాణ – రెంజల్

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో శుక్రవారం నేటి వదిలితే పెరిగి గోదావరిలో కొత్త నీరు వచ్చింది. కేంద్ర జల వనరుల శాఖ అధికారుల ఆదేశాల మేరకు మే ఒకటి, జూన్ 1న, బాబ్లీ గేట్లు ఎత్తివేయాలని ఆదేశాలు ఉండడంతో ఈరోజు బాబ్లీ గేట్లను ఎత్తివేయగా నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో రావడం వల్ల ఘాట్ ల వద్దనే పుణ్య స్థానాలను ఆచరించాలని అధికారులు ఆదేశాలను జారీ చేశారు. జాలారులు గోదావరిలోకి వెళ్లకూడదని అధికారులు ఆజ్ఞలను జారీ చేశారు. బాబ్లీ గేట్ లు తెరవడంతో గోదావరి ద్వారా ఎస్సారెస్పీలోకి నీరు ప్రవహిస్తోంది.
Spread the love