పిల్లల్ని కొట్టి, భిక్షం ఎత్తిస్తున్న మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి

– ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్ 
నవతెలంగాణ – కంటేశ్వర్
పిల్లల్ని చిత్రహింసలు పెట్టి కొట్టి వికలాంగులుగా చేసి బిక్షం ఎత్తించి నరకం చూపెడుతున్న మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో నాగారం 80 క్వార్టర్స్ లో ప్రాంతంలో  ఇతర జిల్లాల నుంచి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకువచ్చి ఆ పిల్లల్ని చిత్రహింసలు పెట్టి కొట్టి వికలాంగులుగా చేసి వారిని బిక్షం ఎత్తిస్తు నరకం చూపెడుతున్న బెగ్గింగ్ మాఫియా. ఈ ఘటనపై స్పందించి ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి వారి కార్యకర్తలు సంఘటన స్థలానికి చేరుకొని ఆరా తీయగా మహబూబ్ అనే ముస్లిం వ్యక్తి వికలాంగుడు తన ఇల్లు ఇష్టం వచ్చిన వారికి రెంటుకు ఇవ్వడం వల్ల, ప్రతి రెండు నెలలు మూడు నెలలు 15 రోజులకు ఒకసారి ఆ ఇంటిలో కొత్త కొత్త కుటుంబాలు కనపడతాయని స్థానికులు చెప్పారు.  ఎందుకు ఎవరు వచ్చినా ఎక్కువ రోజులు ఉండట్లేదు అని అడుగుతే నా ఇల్లు నా ఇష్టం మీకు అడిగే అర్హత లేదు అంటూ స్థానికులకు బెదిరింపులకు గురి చేస్తూ, ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడు కాదని అనేది అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు.  ఈ బాబును కూడా గత వారం రోజుల క్రితం అతడి ఇంట్లో అద్దెకు ఉంటున్న మైనార్టీ మహిళ ఎత్తుకు రావడం జరిగింది. స్థానికులు ఈ కొత్త బాబు ఎవరు అని ప్రశ్నించగా మా ఆడబిడ్డ కొడుకు అని సమాధానం  ఇవ్వడం జరిగింది. నాలుగు రోజుల క్రితం బాబు విపరీతంగా ఏడవడంతో పక్కింటి వారు గమనించి ఎందుకు బాబు అంతలా ఏడుస్తున్నారు. ఒకసారి మీరు బయటకు తీసుకురండి. ఎందుకు బయటకు ఆ బాబుని తీసుకు రావటం లేదని స్థానికులు మొండికేయడంతో బయటకు తీసుకో వచ్చేసరికి,  బాబుకు విపరీతమైన గాయాలు, రెండు కనులు కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ఆ కళ్ళల్లో నుంచి రక్తం చీము కారడం స్థానికులు గమనించారు. 100కు  డయల్ చేసి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు బెగ్గింగ్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని బాబుని బాలల సంరక్షణ సంస్థకి అప్పగించడం జరిగింది. ఎక్కడైతే మాస్ ఏరియాలు ఉన్నాయో, చిన్నపిల్లలకి స్నాపింగ్సే కాదు గంజాయి డ్రగ్, అమ్మాయిల తరలింపు ఇలాంటివి చాలా జరుగుతున్నాయని, చాలాసార్లు కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి మాస్ ఏరియాలో పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని యువతను మహిళలను చిన్నపిల్లల్ని కాపాడాలని ఐద్వా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. ఇందులో ఐద్వా నాయకులు శారద ఇంద్ర శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Spread the love