నకిలీ గల్ఫ్ ఎజెంట్లు, సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలి

– పోలీస్ కమీషనర్ వెల్లడి
నవతెలంగాణ – కంటేశ్వర్ 
నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్లు సంస్థలు, ఉపాధికల్పిస్తామని, వీసా, పాస్పోర్టు ట్రావెల్, టూరిజం సర్వీసుల పేరుతో ఎలాంటి అనధికార లైసెన్స్ అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నారు. అలాగే నకిలీ జాబ్ర్స్ లేటర్లు చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు. కావున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బుధవారం ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వారికి విదేశాల్లో ఉపాధి కల్పించడం వీసా పాస్పోర్టు రవాణా, టూరిస్టు సేవలు కల్పిస్తామని గల్ఫ్ ఏజెంట్లు చాలా మంది ఎలాంటి గుర్తింపు లేకుండా సంబంధిత అధికారుల అనుమతి లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో లైసెన్సులేని వ్యక్తులు మరియు సంస్థలు పైన పేర్కొన్న చట్టవిరుద్దమైన పద్దతుల ద్వారా చాలా మంది అమాయకులను మోసగిస్తున్నారు. వీరిపై అనేక క్రిమినల్ కేసులు కూడా నమోదు అయ్యాయా అని తెలిపారు. కావున అటువంటి గల్ఫ్ ఏజెంట్లకు ఇల్లు కిరాయికీ లేదా దుకాణాల సాముదయాలు కిరాయికి ఇచ్చేముందు అట్టి గల్ఫ్ ఏజెంటుకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత పోలీస్ వారి దృష్టికి తీసుకువచ్చి, పోలీసువారి అనుమతి తీసుకొన్న తరువాతనే వారికి కిరాయికీ ఇవ్వాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ యజమానులకు ప్రజలకు సూచించారు.ఎవ్వరయిన నకిలీ గల్ఫ్ ఏజెంటులు ఉన్నట్లు సమాచారం తెలిస్తే మీ దగ్గరలోని పోలీస్ వారికి తెలియజేసి సహకరించగలరు. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచబడును అని తెలియజేశారు. ఒకవేళ ఎవ్వరయిన ఉల్లంఘిస్తే వారిపై తెలంగాణ గెజిట్ పార్టు- 4 , తేది: 08-10-2016 జి.ఓ నెంబర్ 163 ద్వారా, క్లాజ్ (డి) సెక్షన్ 26(1)(ఎ) హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం 1348 ఫస్లీ మరియు భారత శిక్షాస్మృతి ప్రకారంగా చర్యలు తీసుకొబడును అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలియజేశారు.
Spread the love