కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే?

నవతెలంగాణ- హైదరాబాద్ : మాజీ స్పీకర్ పోచారం కాంగ్రెస్లో చేరిన వేళ బీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే హస్తం పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వార్తలొస్తున్నాయి. అయితే నిన్న జానారెడ్డి పుట్టినరోజు కావడంతో విషెస్ చెప్పడానికే లక్ష్మారెడ్డి వెళ్లారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.

Spread the love