- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వరుస ప్రమాదాలు రైల్వే శాఖను ఆందోళనకు గురిచేస్తున్నాయి. బీహార్ లోని ససారం రైల్వే స్టేషన్ లో ట్రైన్ మంటల్లో కాలిపోయింది. ససారం నుంచి పాట్నా వెళ్తున్న రైలు తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదానికి గురైంది. రైలు ఒక కోచ్ పూర్తిగా అగ్నికి దగ్ధమైపోయింది. మంటలు అంటుకున్న భోగీని రైలు నుంచి వేరు చేశారు రైల్వే సిబ్బంది. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే చెలరేగినట్లు ప్రాథమిక విచారణ ద్వారా తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు.
- Advertisement -



