- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ శివారులో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు కాంతాల రాజిరెడ్డి ట్రాక్టర్‌పై కరీంనగర్ వైపు వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై నుంచి ఎగిరి కిందపడిన రాజిరెడ్డిపై నుంచి డీసీఎం దూసుకుపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
- Advertisement -



