ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల

నవతెలంగాణ – అనంతపురం
ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 24న ఈ పరీక్షను నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023 విద్యా సంవత్సరానికి ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఫలితాలు కాసేపట్లో అందుబాటులోకి రానున్నాయి.

Spread the love