Wednesday, May 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాది హామీ పనులను పరిశీలించిన ఏపీఓ తులసీ రామ్

ఉపాది హామీ పనులను పరిశీలించిన ఏపీఓ తులసీ రామ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని చండేగావ్ గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను జుక్కల్ ఏపీఓ తులసీ రామ్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి స్థానిక సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మణ్ తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్య పెంచాలని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిభందనల ప్రకారం ఈసీ ఆదేశాల ప్రకారం టీఏ ఇచ్చిన కొలతల అనుసరించి పనులు నిర్వహించాలని, ఎఫ్ ఏ పర్యవేక్షణలో చేపట్టాలని నిర్ణయించారు.

అప్పుడే కూలీలు ఎంత పని చేస్తే అంతవరకు కొలతల ప్రకారమే డబ్బులు చెల్లిస్తామని అన్నారు. కూలీలకు త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్ కు ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీవో తులసి రామ్, జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి,  గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, ఉపసర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్, జిపి పాలకవర్గం సభ్యులు,  గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -