పీజీ, పీహెచ్డీ కోసం దరఖాస్తు ఆహ్వానం..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్యం ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వార విదేశీ విశ్వ విద్యాలయాలలో పీజీ,  పీ హెచ్ డి ఉన్నత విద్య నభ్యసించే మైనారిటీ   (ముస్లిం, క్రిస్టియన్) విద్యార్దుల కొరకు ( స్ప్రింగ్ సీజన్)  01.01.2024 నుండి 31.07.2024 వరకు విశ్వ విద్యాలయాలలో ప్రవేశం తీసుకొని ఉన్న విద్యార్దులు , వారి కుటుంబ ఆదాయం ఐదు లక్షల రూపాయలు లోపు గల వారు అర్హులు వీరి నుండి  దరఖాస్తులు చేసుకోవాలని ఇన్చార్జ్ మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి పి యాదయ్య గురువారం ఒక ప్రకటనలో కోరారు.  ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్దులకు 20 లక్షల రూపాయల ఉపకార వేతనంతో పాటు విమానం ప్రయాణం ఖర్చులకు 60 వేల రూపాయలు ఇవ్వడం జరుగును.పైన పేర్కొనబడిన కోర్సులకు వెబ్సైటు www.telanganaepass.cgg.gov.in ద్వార ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేది: 07-08-2024 సాయంత్రం 5.00 గంటల లోగ నమోదు చేసుకోగలరని తెలిపారు. మరిన్ని వివరాల కొరకు మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంను, 9505640004 నెంబర్ను సంప్రదించాలని కోరారు.
Spread the love