ఎమిలీ పాఠశాలలో ఉచిత విద్యకై దరఖాస్తు చేసుకోండి

నవతెలంగాణ-అశ్వాపురం
మండల కేంద్రంలోని ఎమిలీ ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్య కోసం నిరుపేద పిల్లల తల్లిదండ్రులు దరఖాస్తులు చేసుకోవాలని ఆ పాఠశాల కరస్పాండెంట్‌ ములకలపల్లి గోపీనాథ్‌ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపిక ప్రక్రియ, పరీక్ష నిర్వహణ ద్వారా ఉంటుందన్నారు. ఉచిత విద్యకు పరిమిత సీట్లు మాత్రమే ఉంటాయన్నారు. మండలంలోని నిరుపేద పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కడు నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందజేస్తున్నమని, వితంతువు, ఒంటరి మహిళ, పురుషుడు, ఎవరి సంరక్షణలో అయినా పిల్లలు పెరుగుతున్నట్లయితే మండలంలో ఎక్కడి నుంచైనా మా పాఠశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తులన్నిటిని పరిశీలించిన అనంతరం అందరికీ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు 1వ తరగతి నుండి 7 వతరగతి వరకు ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. ఎంపికైన వారు కేవలం పుస్తకాలు, యూనిఫామ్‌ మాత్రం తీసుకోవాలని, విద్యను పూర్తిగా ఉచితంగా అందిస్తామని, చదువు కొరకు ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈనెల 15వ తేదీ లోపు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, పరీక్ష నిర్వహణకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఫోన్లో సమాచారం అందిస్తామన్నారు. దరఖాస్తులు అశ్వాపురంలోని రాజేందర్‌ మీసేవలో దొరుకుతాయని, వివరాలకు 9912467858, 9182202087 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Spread the love