నవతెలంగాణ-బెజ్జంకి: ఎస్టీయూ మండల నూతన కార్యవర్గ కమిటీ నియామకం చేపట్టినట్టు ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్టీయూ మండల అధ్యక్షుడిగా నారోజు శంకరాచారి, ప్రధాన కార్యదర్శిగా రామంచ రవీందర్, ఆర్థిక కార్యదర్శిగా ఎండీ షాబుద్దీన్, ఉపాధ్యక్షులుగా రాజమల్లు, సతీష్ కుమార్, కార్యదర్శులుగా వనం రవీందర్,రేణుక,సుచరిత ఎన్నికైనట్టు వడ్లకొండ శ్రీనివాస్ తెలిపారు.