సాంకేతిక సమస్యతో గయలో ల్యాండ్‌ అయిన ఆర్మీ విమానం..

నవతెలంగాణ – హైదరాబాద్: భారత ఆర్మీకి చెందిన ఓ చిన్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. ట్రైనింగ్‌ సెషన్‌లో ఉండగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం బీహార్‌లోని గయ జిల్లాలో మైదానంలో ల్యాండ్‌ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు ట్రైనీ పైలట్లు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)కి చెందిన మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ మంగళవారం ఉదయం ట్రైనింగ్‌ సెషన్‌లో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో 9.15 గంటలకు పహార్‌పూర్‌లోని మైదానంలో దిగింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు ట్రైనీ పైలట్లు ఉన్నారు. వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన ఇద్దరు పైలట్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు గయ ఎస్‌ఎస్‌పీ ఆశిష్‌ భారతి తెలిపారు.

Spread the love