రేవంత్ రెడ్డితో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల కోసం కలిసినట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతుండటం క్షేత్రస్థాయి గులాబీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. స్వయంగా కేసీఆర్ నిర్వహించిన సమావేశాలకు కూడా గైర్హాజరు అవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలు సూచిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఒక్క ఎమ్మెల్యే చేజారినా ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళుతుందని సూచిస్తున్నారు.

Spread the love