నిజాం కళాశాల విద్యార్థుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌ : బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాల విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. హాస్టల్‌లో నాసిరకం భోజనం పెడుతుంటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్టల్‌ ముందు బైఠాయించారు. హాస్టల్‌ మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల నిరసనతో బషీర్‌బాగ్‌లో రోడ్డుపై ట్రాఫిక్‌ జామైంది. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులతో మాట్లాడి ట్రాఫిక్‌ క్లియర్‌ చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love