ఆల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు

ALPHA Hotelనవతెలంగాణ – సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లో గల ఆల్ఫా హోటల్‌లో బాంబు ఉందని అజ్క్షాత వ్యక్తి ఫోన్ చేశాడు. శనివారం రాత్రి 10.45 గంటలకు 100 నంబర్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. వెంటనే పోలీసులు ఆల్ఫా హోటల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న హోటల్ సిబ్బందిని బయటకు పంపించి రెండు గంటల పాటు తనిఖీ చేశారు. హోటల్‌లో బాంబు లేదని తెలిపారు. ఫోన్ చేసింది ఆకతాయి అని వివరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి ఫోన్ చేశాడని గుర్తించారు. అతనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love