Saturday, July 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅంతిమ వీడ్కోలుకు ఏర్పాట్లు

అంతిమ వీడ్కోలుకు ఏర్పాట్లు

- Advertisement -

టెహ్రాన్‌‌కు చేరిన అయతొల్లా ఖమేనీ భౌతిక కాయం
నేడు, రేపు ప్రజల సందర్శనకు అనుమతి
6న అంతిమ యాత్ర..9న ఖననం
తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా దూరం?


​టెహ్రాన్‌ : అమెరికా దాడిలో మరణించిన ఇరాన్‌ ‌సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీకి అంతిమ వీడ్కోలు పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన మృతదేహాం టెహ్రాన్‌‌కు చేరుకుంది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇరాన్‌ ‌ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఖమేనీ మరణించిన ప్రదేశానికి సమీపంలో ప్రసిద్ధ ‘ఇమామ్‌ ‌ఖొమేనీ హుస్సేనియా’ వేదికగా ఈ అంత్యక్రియల క్రతువు జరగనుంది. ఇరాన్‌ ‌సంప్రదాయాల ప్రకారం దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 4, 5 తేదీలలో (నేడు, రేపు) టెహ్రాన్‌‌లో రెండు రోజుల పాటు ప్రజల సందర్శనకు అవకాశం కల్పించనున్నారు. నేటి ఉదయం నుంచి ప్రజలు నివాళులర్పించేందుకు అనుమతిస్తారు. ఇక రేపు ఉదయం ప్రార్థనలు నిర్వహిస్తారు. 6న అంతిమ యాత్ర నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం మషాద్‌‌లో ఈనెల 9న ఖననం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి దాదాపు రెండు కోట్ల మంది వరకు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో టెహ్రాన్ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ అంతిమ వీడ్కోలు కార్యక్రమానికి ఇరాన్‌ ‌ప్రభుత్వ, సైనిక ఉన్నతా ధికారులు భారీగా హాజరవుతున్నారు. ఇస్లామిక్‌ ‌రివల్యూషనరీ గార్డ్‌ ‌కార్ప్స్‌ (ఐఆర్‌‌జీసీ) కమాండ్‌ ఇన్‌ ‌చీఫ్‌ అహ్మద్‌ ‌వాహిదితో పాటు పలువురు కీలక దౌత్యవేత్తలు, సైనిక ప్రముఖులు ఖమేనీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఖమేనీ అంత్యక్రియలకు ఆయన కుమారుడు, ప్రస్తుత ఇరాన్‌ ‌సుప్రీం లీడర్‌ ‌మొజ్తాబా ఖమేనీ హాజరయ్యే పరిస్థితులు కనిపించడం లేవు. ఆయన తన తండ్రి అంత్యక్రియలకు ప్రత్యక్ష‍ంగా హాజరు కాకపోవచ్చని ఇరాన్‌ ‌వర్గాలు తెలిపాయి. అయితే ఇజ్రాయిల్‌ ‌నుంచి ముప్పు ఉందన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించాయి. ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమానికి భారత్​ తరఫున బీహార్ గవర్నర్, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -