అభివృద్ధి చేయలేకనే ఆరోపణలా..?

– బీఆర్ఎస్ యువజన మండలాధ్యక్షుడు బిగుల్ల మోహన్ 
నవతెలంగాణ – బెజ్జంకి
అభివృద్ధి చేయలకనే ప్రజల దృష్టి మరల్చడానికి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కాంగ్రెస్ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారని..ఆరోపణలు మానుకుని ఇచ్చిన ఆరు గ్యారెంటీలు,అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎంపీపీ నిర్మల ఇంటి వద్ద ఏర్పాటుచేసిన యువజన కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ యువజన మండలాధ్యక్షుడు బిగుల్ల మోహన్ సోమవారం సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గణపురం తిరుపతి, లింగాల బాబు,విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు బిగుల్ల దుర్గ సుదర్శన్, ప్రధాన కార్యదర్శి పొట్లపెల్లి శివకృష్ణ,మామిడ్ల తిరుపతి,  తదితరులు పాల్గొన్నారు.
Spread the love