
ఆధునిక భారత నిర్మాత, మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుల అశోక్ యాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలతో ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మేంచు చక్రయ్య , దరిపెల్లి వీరన్న, మరాఠి రామస్వామి, రాచకొండ అయోధ్య,బంటు క్రాంతి, జటంగి గణేష్, ఇరుగు కిరణ్, గుణగంటి వెంకన్న, బంటు బద్రి, యువజన కాంగ్రెస్ నాయకులు నెల్లుట్ల మహేష్, మట్టి నరేష్, తదితరులు పాల్గొన్నారు.