చరిత్ర సృష్టించిన స్పిన్నర్ అశ్విన్

నవతెలంగాణ – హైదరాబాద్: ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రాంచీలో జరుగుతున్న టెస్టులో టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్రకెక్కారు. ఇండియా లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ గా మరో రికార్డు సృష్టించారు. భారత గడ్డపై అత్యధికంగా 350 వికెట్లు (63 మ్యాచులు) తీసి అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉండగా, రాంచీ టెస్టు మ్యాచ్లో ఇప్పటి వరకు తీసిన వికెట్లతో అశ్విన్ ఆయన్ను దాటేశారు. ఇక 5 వికెట్ల రికార్డులోనూ కుంబ్లేను (35) అశ్విన్(34) సమం చేసే అవకాశం ఉంది. ఇంగ్లండ్ తో జరుగుతున్న 4వ టెస్ట్ తొలి ఇన్నింగ్సులో భారత్ 307 రన్సు ఆలౌటైంది. యశశ్వీ జైస్వాల్ 73 పరుగులు చేయగా గిల్ 38, కుల్దీప్ 28, పాటీదార్ 17, సర్ఫరాజ్ 14, జడేజా 12 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ 5 వికెట్లతో సత్తా చాటారు. హార్టీ 3, అండర్సన్ 2 వికెట్లు తీశారు. భారత్ మరో 46 రన్స్ వెనుకంజలో ఉంది. ఇక ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లీష్ జట్టు 144 పరుగులకు ఎనిమిది వికెట్లను కోల్పోయి 190 పరుగుల ఆదిక్యం లో ఉంది.

Spread the love