
– నోటిఫికేషన్ నేపధ్యంలో విశ్లేషణ…
నవతెలంగాణ – అశ్వారావుపేట
జాతీయ ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపద్యంలో అశ్వారావుపేట నియోజక వర్గం పై ఓ విశ్లేషణ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సత్తుపల్లి నియోజక వర్గంలో భాగంగా ఉన్న అశ్వారావుపేట ప్రాంతాన్ని అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజనలో భాగంగా 2009 లో అశ్వారావుపేట నియోజక వర్గం కేంద్రంగా అశ్వారావుపేట,దమ్మపేట,ములకలపల్ లి,కుక్కునూరు,వేలేరుపాడు మండలాలతో గిరిజన నియోజక వర్గం నెంబర్ 118 గా 1,53,267 ఓటర్లలో రూపొందింది.మొదటి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్ధి వగ్గెల మిత్ర సేన విజయం సాధించారు. రాష్ట్రాల పునర్విభజన అనంతరం 2014 లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన అనంతరం మొదటి సారిగా ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో 1,67,493 మంది ఓటర్లు గా నమోదు అయ్యారు.ఈ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి.పి అభ్యర్ధి తాటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు.2018 లో వేలేరుపాడు,కుక్కునూరు ఆంధ్రప్రదేశ్ లో విలీనం కావడంతో అశ్వారావుపేట,దమ్మపేట,ములకలపల్ లి,చండ్రుగొండ,అన్నపురెడ్డిపల్ లి మండలాలతో 1,43,960 ఓటర్ల తో నియోజకవర్గం పునర్విభజన జరిగింది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్,తెదేపా ఉమ్మడి అభ్యర్దిగా మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు.
2023 ఎన్నికల్లో 1,53,757 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.ఈ సారి అశ్వారావుపేట ఎమ్మెల్యే ఎవరనేది ప్రశ్నార్ధకం.
ఓటర్లు | ఎన్నికలు | ఎన్నికలు | ఎన్నికలు | ఎన్నికలు |
2009 | 2014 | 2018 | 2023 | |
పురుషులు | 15323 | 82420 | 70641 | 75080 |
స్త్రీలు | 77945 | 85064 | 73307 | 78167 |
ఇతరులు | —- | 09 | 12 | 06 |
మొత్తం | 153267 | 167493 | 143960 | 153757 |
———-
. . .