శ్రీనగర్ గ్రామంలో 27 సి.సి కెమెరాలు ప్రారంభించిన అసిస్టెంటు కమీషనర్ ఆఫ్ పోలీస్

నవతెలంగాణ కంటేశ్వర్
జూన్ 30న నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్.ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్. ఆదేశాల మేరకు నిజామాబాద్ రూరల్ మండలంలోని శ్రీనగర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటి ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా దాదాపు 27 సి.సి కెమెరాలు కొనుగోలుచేయగా వాటిని నిజామాబాద్ అసిస్టెంటు కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎమ్. కిరణ్ కుమార్ ప్రారంభించ డం జరిగింది.మొట్టమొదలు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సి.సి టివిలు సి.సి కెమోరాలను అసిస్టెంటు కమీషనర్ ఆఫ్ పోలీస్ శుక్రవారం ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా అసిస్టెంటు కమీషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో సి.సి కెమెరాలు ఎంతో కీలకం అనియు, ఆయా గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న సి.సి కెమెరాలు నేరగాల్ల గుట్టు రట్టులో ఎంతో దోహాదపడుతున్నాయని, సి.సి కెమెరాల వలన ఇప్పటివరకు ఎన్నో దొంగతనాలకు పాలుపడిన నేరగాళ్లను, కిడ్నాప్ కేసులో నిందితులను ఎంతో సులువుగా పట్టువోవడం జరిగిందన్నారు. జనరద్దీగల ప్రదేశాలలో, బస్టాండ్, చౌరస్తాలలో మొదలగు ప్రాంతాలలో ప్రతీ ఒక్కరు సి.సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అలా చేయడం వలన నేరాలు నియంత్రించ వచ్చని, నేరం జరిగిన తర్వాత బాధపడేబదులు ముందుగానే సి.సి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరం జరుగదని ఒక్క సి.సి కెమెరా 100 మంది పోలీస్ సిబ్బందితో సమానం అన్నారు. మహిళలపై జరిగే సంఘటనలకు సి.సి కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయని, శ్రీనగర్ గ్రామాభివృద్ధి కమిటి మరియు గ్రామస్థుల సహాకారం తో ఏర్పాటు చేసినందులకు ఎంతో సంతోషకరం అని, శ్రీనగర్ గ్రామములో దాదాపు 27 సి.సి కెమెరాలు ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులను అభినందిచండ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సురక్షితమైన భద్రతా కోసం పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తుందని అన్నారు. పోలీస్ శాఖలో గతం లో కన్న ఎన్నో మార్పులు జరిగాయాని ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా పోలీస్ శాఖ ప్రజలతో మమేకంగా పనిచే స్తుందని తెలియజేశారు.సి.సి కెమెరాలు ఏర్పాటు చేసుకొనువారు మంచి నాణ్యత గలవి ఏర్పాటు చేయాలని, ఆ కెమోరా పరిధిలోని సంఘటన స్థలం భాగాకనపడేవిధంగా ఉండాలని, ఉదయం మరియు రాత్రి సమయంలో పని చేసేవిధంగా ఉండాలని అన్నారు. ప్రజలకు గల సమస్యలపై డయల్ 100 ను సద్వినియోగం చేసుకోవాలని, ఎవరికైన సమస్య ఉంటే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ సిబ్బంది సంప్రదించాలని, నేరాల నియంత్రణలో భాగంగా పోలీస్ కళాబృందం ద్వారా ప్రచారం చేయుచున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సౌత్ రూరల్ సి.ఐ సురేంధర్ రెడ్డి, రూరల్ ఎస్.ఐలు లింబాద్రీ, జడ్.పి.టి.సి బి. సుమలత, ఎమ్.పి.టి.సి అంశాల నీరజ, సర్పంచ్ ఉడుముల సురేంధర్ రెడ్డి, ఉపసర్పంచ్ షేక్లో బీ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గోన్నారు.

Spread the love