జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు 

– బీఆర్ఎస్ యువజన నాయకుడు బండిపెల్లి సతీశ్ ఆరోపణ 
నవతెలంగాణ – బెజ్జంకి 
రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని బీఆర్ఎస్ మండల యువజన నాయకుడు బండిపెల్లి సతీశ్ సోమవారం ఆరోపించారు. ప్రజలకు,  ప్రభుత్వాలకు వారధులుగా నిలిచే జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని ప్రభుత్వం గుర్తించి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని సతీశ్ డిమాండ్ చేశారు.
Spread the love