మోడీ ప్రభుత్వంలో అనేక రాష్ట్రాలలో ఎస్సీలపై దాడులు..

– స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా.. సమాజంలో దళితులపై ఇంకా వివక్ష 
– కూనంనేని సాంబశివరావు: కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సమాజంలో దళితులపై ఇంకా వివక్ష కొనసాగుతుందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు గారు అన్నారు. యాదగిరిగుట్ట లో నిర్వహిస్తున్న దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు మొదటి రోజు ఆయన ప్రారంభించి మాట్లాడాతూ.. దళితులపై వివక్ష పోవాలంటే లాల్ నీల్ ఒక్కటే మార్గమని ఆ ధైర్యాన్ని ఇచ్చేది మార్క్సిజం అంబేద్కర్ సిద్ధాంతం ఒకటేనని అన్నారు. ఈ సమాజంలో సంపదను సృష్టించే శ్రమైక జీవన విధానంలో మమేకమైన వారే దళితులని సమాజం శ్రమదార అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రాజ్యాంగంలో అనేక రకాల హక్కులను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరచారని ఆ హక్కులన్నీ సాధించడం కోసం పోరాటం ఒక్కటే మార్గమని ఆ పోరాట మార్గంలో కమ్యూనిజం అంబేద్కర్ ఇజం ఆచరించడం ద్వారా పోరాటంలో విజయం సాధిస్తామని అన్నారు. వివక్ష లేని సమాజం సాధించడం కోసం వర్గాలు లేని సమాజాన్ని సాధించడం కోసం మార్క్స్ చూపించిన వర్గ పోరాటం సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ చూపించిన కుల రహిత సమాజాన్ని సాధించడం కోసం దళిత హక్కుల పోరాట సమితి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మూడు రోజులు సాగే ఈ శిక్షణ తరగతులు దళిత సమాజం మార్పు కోసం దోహదపడతాయని ఆశించారు. దేశంలో మతోన్మాదం కులం మాదం పెరుగుతున్న ఈ సందర్భంలో సహజంగానే మతం అనే ఒక మత్తు సమాజంలో చొచ్చుకుపోయిందని దాన్ని తొలగించడంలో కమ్యూనిస్టుల పాత్ర ఎంత ఉందో, అంబేద్కర్ వారసుల పాత్ర అంతే ఉందని, అంబేద్కర్ మార్క్స్ వారసులుగా దళిత హక్కుల పోరాట సమితి కార్యకర్తలుగా సమాజం మార్పు దిశగా మనమంతా ప్రయాణించాలని కోరారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తీసుకువచ్చిందని, గత ప్రభుత్వంలో సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లాయని, అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు పౌరులపై ఉందని అన్నారు. అదేవిధంగా విద్య ఉపాధి వైద్యం అవకాశాలను ప్రభుత్వం ఉచితంగా కల్పించిన నాడే వివక్ష అనేది పోతుందని వివక్ష లేని చదువులు కోసం కామన్ స్కూల్ విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ రోజుల్లో కూడా ఇంకా వివక్ష కొనసాగుతుందని ఆ వివక్షపూరిత సమాజాన్ని మార్చడంలో దళిత హక్కుల పోరాట సమితి కార్యకర్తలు కంకణబద్ధులై ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశంలో మోడీ ప్రభుత్వంలో అనేక రాష్ట్రాలలో ఎస్సీ లపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయని మతోన్మాద సంఘ పరివారశక్తులను ఎదుర్కోవడంలో అంబేద్కర్ మార్క్స్ సిద్ధాంతం జోడించి ఉద్యమాలు నడపాల్సిన అవసరం ఉందని ఆ ఉద్యమంలో కమ్యూనిస్టులు దళితులు భాగస్వామ్యంతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, డి హెచ్ పి ఎస్ గౌరవ అధ్యక్షులు కె ఏసురత్నం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శిలు యానాల  దామోదర్ రెడ్డి, బోలగానీ సత్యనారాయణ, ప్రజానాట్యమండలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లెం  కృష్ణ, బండి జంగమ్మ, ఏషాల అశోక్, ఎండి ఇమ్రాన్, చెక్క వెంకటేష్ , కొల్లూరు రాజయ్య, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంజి వీరస్వామి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు వెల్లంకి మహేష్ , ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్, యాదగిరిగుట్ట సీపీఐ మండల కార్యదర్శి కళ్ళపెళ్లి మహేందర్, బొమ్మలరామారం మండల సెక్రెటరీ అనేమైన వెంకటేశం, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రీధర్, వడ్లకొండ భారతమ్మ, సీపీఐ  మండల కార్యవర్గ సభ్యులు పేరబోయిన బంగారు మహిళా సమాఖ్య మండల అధ్యక్ష కార్యదర్శులు మునుకుంట్ల నరసమ్మ ఆరే పుష్ప, డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు ఎంజాయ్ హేమలత డిహెచ్పిఎస్ యాదగిరిగుట్ట మండల కార్యదర్శి మద్దూరి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love