సంక్షేమ గిరిజన వసతి గృహం ఆకస్మిక తనిఖీ చేసిన ఏటీ డబ్ల్యూఓ

నవతెలంగాణ – పెద్దవూర
మండల కేంద్రంలోని  గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాలను జిల్లా ఏటీడబ్ల్యూఓ లక్షారెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్బంగాగిరిజన ఆశ్రమ పాఠశాల, చలకుర్తి గిరిజన బాలుర వసతి గృహం, గిరిజన బాలుర స్పెషల్ వసతి గృహం తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, మెనూ, వంటగదులు, పరిశీలించారు. విద్యార్థుల ను మెనూ సక్రమంగా సమయానుకూలంగా అందిస్తున్నారా అని  అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.గత ఏడాది విద్యా సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని ప్రిన్సిపాల్ బాలాజీ నాయక్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వేడి వేడి పౌష్టికరమైన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని సూచించారు. ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.అలాగే విద్యార్థులటాయిలెట్, వంటగది బ్లాక్ లు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు.పదవ తరగతి లో అత్యదిక జీపీఏ సాధించేలా విద్యార్థులకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
Spread the love