Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మాదకద్రవ్యాల వినియోగంతో జీవితంలో దుష్పరిణామాలు ఎదురవుతాయని..విద్యార్థులు, యువత దురలవాట్లకు దూరంగా ఉండాలని సీఐ విద్యాసాగర్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయంలో ఈగిల్ ఫోర్స్ తెలంగాణ అధ్వర్యంలో మాదకద్రవ్యాల వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలు, జీవనంపై చూపే ప్రభావాలపై సీఐ విద్యాసాగర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి పౌరుడు మాదకద్రవ్యాల నివారణలో భాగాస్వాములై మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఐ సూచించారు. అనంతరం సీఐని విద్యాలయ ప్రధానాచార్యులు డాక్టర్ సంగీత సిబ్బందితో కలిసి శాలువా కప్పి సన్మానించి జ్ఞాఫికనందజేశారు. హెడ్ కానిస్టెబుళ్లు రమేశ్, అంజయ్య, కానిస్టెబుల్ శ్రీనివాస్, పీడీ కనుకా రెడ్డి, బోధన సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -