నవతెలంగాణ -పెద్దవంగర
వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో బోడెపూడి వేణుమాధవ్ అన్నారు. మండలంలోని వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో కలిసి సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్షాకాలంలో వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు తదితర సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు గ్రామ స్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, నిల్వ నీటి తొలగింపు, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించారు. ప్రతి గ్రామంలో ముందస్తు చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్య రక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ నందనా దేవి, ఎంఈవో బుధారపు శ్రీనివాస్, ఏవో గుగులోత్ స్వామి నాయక్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



