కేశప్పగూడెం లో పోషకాహారం పై అవగాహన

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండల పరిధిలోని కేశప్పగూడెం లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంగన్వాడీ కేంద్రం లో మంగళవారం గర్భవతులకు పోషకాహారం పై అవగాహన కల్పించారు.స్థానిక సర్పంచ్ బాబురావు, సూపర్వైజర్ వరలక్ష్మి, అంగన్వాడీ టీచర్ లక్ష్మి కుమారి, తల్లులు, గర్భవతులు పాల్గొన్నారు. ఈ అవగాహనలో తల్లిపాలు ఆవశ్యకత, ఆకు కూరలు,కూరగాయల్లో ఉండే పోషకాలు పై సీ.డీ.పీ.వో రోజా రాణి వివరించారు.అసిస్టెంట్ సీ.డీ.పీ.వో ప్రమీల పాల్గొన్నారు.
Spread the love