కేంద్ర ప్రభుత్వ పథకాల ‘ వికసిత్ భరత్ ‘  అవగాహన

– కేంద్రప్రభుత్వం దేశ ప్రజలకు అందిస్తున్న పథకాల అవగాహనా ” వికసిత భరత్ ” కార్యక్రమము  ఆయా పథకాల ద్వారా కోట్ల కుటుంబాలకు లబ్ది : ఎంపిడిఓ లక్ష్మణ్ 
నవతెలంగాణ – ధర్పల్లి
మండల కేంద్రములో శనివారం ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో  అధికారాలు వికసిత్ భరత్ కార్యక్రమము నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపీడీఓ కొండా లక్ష్మణ్ పాల్గొని, కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాల్లో దేశంలోని కోట్ల మందికి వివిధ రకాల పథకాలు అందిస్తున్న తీరును అయన ప్రజలకు వివరించారు. అటల్ పెన్షన్ యోజన,పియం స్వనిది యోజన ,ఆయుష్మాన్ భరత్,పియం జన ఆరోగ్య యోజన,పియం జన అఓషది యోజన,సర్ధికారత,పియం ముద్ర యోజన,సుకన్య సంవృద్ధి యోజన,పౌష్టిక ఆహార యోజన ,పియం కిసాన్ యోజన,పియం కిసాన్ సంవృద్ధి కేంద్రాలు,గరీబ్ కళ్యాణ్ యోజన ఇలా అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి వందల కోట్లతో కోట్ల కుటుంబాలకు ఆదుకున్న పతకాలను వివరాయించారు,అలాగె కేంద్రప్రభుత్వ శాఖల వారీగా అధికారులు ఈకార్యక్రమములో పాల్గొని తమ తమ శాఖల వారీగా మండలంలోని గ్రామాల్లో ఎన్ని కుటుంబాలకు ఏయే పథకాలు అందిచడం జరిగింది ,అలాగే ఎలాంటి కుటుంబాలు ఏయే పథకాలకు అరుహులవుతారో ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పతాకాలపై అవగాహనా పెంచుకొని లబ్ది పొందాలని సూచించారు. కార్యక్రమములో ఈవోపీఆర్డీ రాజేష్,పంచాయతీ కార్యదర్శి సైఫాద్దీన్,అన్ని ప్రభుత్వ కార్యాలయల అధికారులు,ఆశ వర్కర్లు,ఏఏన్ఎం లు అంగన్వాడీలు,ఐకెపి ఏపియం ,బీజేపీ నాయకులు కర్క గంగారెడ్డి,పాల్తి గంగాదాస్,పెంటయ్య,గ్రామా ప్రజలు పాల్గొన్నారు.   
Spread the love