అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు పై అవగాహన

నవతెలంగాణ – రాయపోల్
పాఠశాలలో మౌళిక వసతుల కల్పన, విద్యార్థుల సంఖ్య,హాజరు శాతం పెంచుట వంటి అంశాలతో పాఠశాలల అభివృద్ధికి అమ్మ  ఆదర్శ  పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని రాయపోల్ ఎంపీడీఓ బాలయ్య అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు పై  గ్రామసంఘం  అధ్యక్షురాలు,వివోఏలకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ  పాఠశాలలో మౌలిక  వసతుల కల్పన, విద్యార్థుల సంఖ్యను పెంచుట,హాజరు శాతమును పెంచుట,టాయిలెట్ల ఏర్పాటు మొదలగు  మౌలిక  వసతుల ఏర్పాటు కొరకై అమ్మ  ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామాలలోని గ్రామైక్య సంఘాలలో గల వివో అధ్యక్షురాలు గ్రామాలలోని ఈ కమిటీలకు  సంబంధించి గ్రామ సంఘం అధ్యక్షురాలు చైర్పర్సన్ గా ఉంటారు, వీరితోపాటు పాఠశాలలో గల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమిటీ కన్వీనర్ గా ఉంటారు. ప్రతి తరగతి నుంచి ముగ్గురు తల్లులు సభ్యులుగా ఉంటారు.వీరు గ్రామంలోని పాఠశాలలో ప్రాథమిక మౌలిక సదుపాయాలు అనగా తాగునీటి కోలాయిలు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్యాన్లు వివిధ రకాలైన స్కూలుకు సంబంధించిన అన్ని మరవతులను చైర్పర్సన్ హోదాలో పనులు చేయించవలసి ఉంటుంది.  ఈ రకంగా ఎన్ని స్కూలు ఉన్నట్టయితే అన్ని స్కూల్లకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతున్నదన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నర్సమ్మ,ఎంపీవో లక్ష్మీ పిఆర్ఏఈఈ రామ్ కుమార్, ఏపీఎం దుర్గాప్రసాద్, సీసీలు కిష్టయ్య, ప్రవీణ్, నాగరాజు, రవీందర్, అకౌంటెంట్  రేఖ, వివోఏలు,మహిళ సంఘాల అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love