అబద్దాల పునాదిపై అయోధ్య రామాలయం

అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చేయడం గురించి, అది రా ముడి జన్మస్థలం అని అరెస్సెస్‌ – బీజేపీలు ప్రకటించడం గురించి దేశంలో చాలా కాలంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ వివా దం గత పాతికేళ్ళ నుండే కాదు, కొన్ని శతాబ్దాలుగా సాగు తూ ఉంది. సుప్రీం కోర్టు తీర్పు కూడా అది రాముడి జన్మ స్థలమని నిర్దారించలేదు. పైగా బాబ్రీ మసీదును కర సేవ కులు కూల్చడాన్ని నేరంగా పరిగణించింది. కూలగొట్టిన చోటే రామాలయం కట్టుకోవడానికి అనుమతించలేదు. అందుకే, ఆలయ నిర్మాణం ఆ స్థలానికి దూరంగా కడుతు న్నారు. అంతమాత్రానికి మసీదు ఎందుకు కూల్చాల్సి వచ్చిందో, దాని వెనక రాజకీయ మేమిటో ఈ దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మరో వైపు అయోధ్యలో రామ మందిరం దివ్యంగా నిర్మాణమవుతూ ఉంది. అందుకోసం వేల ఇండ్లు ధ్వంసం చేసిన సంగతి, పురాతన కట్టడాలు కూల్చేసిన సంగతి మీడియా కప్పిపుచ్చింది. ఇండ్లు కూల్చిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకుండా అందరినీ నిరాశ్రయుల్ని చేసిన సంగతి మోడీ మీడియా మరుగు పరిచింది. సమస్యను పరిష్కరించే దిశలో కా కుండా సమస్యలు పెంచే దిశలో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళ్ళింది.
భారత రాష్ట్రపతిని గానీ, బీజేపీ అగ్రనేతలను గానీ, ఇతర మతా ల మతపెద్దలను గానీ ఆహ్వానించలేదు. పరిస్థితి గమనించి విపక్షాల కూటమి ‘ఇండియా’ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వెళ్ళకూడ దని నిర్ణయించుకుంది. సృష్టికారకుడు, సర్వశక్తి సంపన్నుడూ అయిన దేవుడు తనకు తానే వెళ్ళి విగ్రహంలో ప్రాణప్రతిష్ట చేసుకోవాలి గానీ, ఎవరో ఒక తుచ్ఛ మానవుడితో ప్రాణప్రతిష్ట చెయించుకోవటమేమి టని హేతువాదులు ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి గొప్పగా ఉపన్యసించే ప్రధాని భార్య లేకుండా పూజలెలా చేస్తాడని మఠాధిప తులంతా ఛీత్కరించారు. ఎందుకు ఎన్ని అన్నా, తాను అనుకుంటున్న ఈ హిందూ దేశానికి తనను తానే రాజుగా ప్రకటించుకుంటున్నట్టు ఆర్భాటం చేశాడు ప్రధాని. ఒక మత కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్ర మంగా మార్చేశాడు. ఆ రోజు దేశవ్యాప్తంగా సెలవు ఇవ్వడం అవసరం లేదు. అదీగాక, ఆసుపత్రులు మూసివేయడం మరింత దారుణం. వి మానాశ్రయం నుండి రామాలయం దాకా రోడ్డు మీద రాముడి కటౌట్లు మోడీ కటౌట్లు పెట్టారు. దేవుడితో సమానంగా ఈ మానవుడి బొమ్మ లేమిటని స్థానికులు ఆగ్రయిస్తే, మోడీ కటౌట్లు రాత్రికి రాత్రి తొలగిం చారు. ఏమైనా రాముడి స్థాయి తగ్గించి, మోడీ తన స్థాయి పెంచుకు న్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. బాబ్రీ మసీదు కూలగొట్టిన సంద ర్భంగా మత ఘర్షణల్లో రెండు వేలకు పైగా మరణించిన విషయం గానీ, కూలగొట్టిన మసీదుకు బదులుగా కొత్త మసీదు నిర్మాణానికి ఐదె కరాల స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం గానీ ఎవరూ మాట్టాడటం లేదు, తప్పు కదా అదీ?
ఇవన్నీ ఇలా ఉంటే చరిత్ర ఏం చెబుతోందీ? బాబర్‌ ఆయోధ్యలో మసీదు కట్టించాడా? దేవాలయాన్ని కూల్చి కట్టించాడా? బాబ్రీ మ సీదు ఆరు డిసెంబర్‌ 1992న కూల్చేసిన తర్వాత ఆ మసీదు అడుగున ఆర్కియాలజీ విభాగానికి ఏ ఆధా రాలు దొరికాయీ? లాంటి విషయాల మీద చరిత్ర కారులు పరిశోధకులు ఏం చెప్పారో తెలుసుకోవడా నికి తప్పని సరై నేను కూడా చరిత్ర పొరల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. మొఘల్‌ చక్రవర్తి బాబర్‌(1483-1530 C.E )కు తన దినచర్య (డైరీ) రాసుకునే అలవాటు ఉండేది. దాన్ని ఆయన చాగ్తాయే-తుర్కీ అనే తన మాతృభాషలో రాసుకున్నాడు. అది ‘తుజక్‌ ఏ బాబ్రీ’ గా వెలువడింది. దాన్ని బాబర్‌ మనుమడు అక్బర్‌ ద గ్రేట్‌ (1542-1605 C.E) తన ఆస్థాన పండితుడితో ఫారసీ భాషలోకి అనువదింపజేశాడు. అప్పుడు అది ‘బాబర్‌నాయా’ గా వెలుగు చూసింది. వీటిలో బాబ్రీ మసీదు ప్రస క్తి లేదు. చాలా కాలం తర్వాత బ్రిటీష్‌ పరిపాలనా కాలంలో బివిరిడ్జి (Annette Susannah Bevereidge) అనే రచయిత్రి భారతదేశం సందర్శించినపుడు తుజక్‌ ఐ బాబ్రీ-బాబర్‌ నామా రెండింటినీ చది వి, వాటి ఆధారంగా ‘మెమొయిర్‌ ఆఫ్‌ బాబర్‌’ పేరుతో 1921లో ఇంగ్లీషు అనువాదం తెచ్చా రు- ఇందులో కూడా బాబర్‌ మసీదు కట్టించిన విషయం లేదు. మూలగ్రంథాల్లోనే లేనప్పుడు అనువాదంలో ఎందుకుంటుందీ? Ibn Battuta – అనే అరబ్‌ యాత్రికడు ఆ కాలం లో తన అనుభవాలనన్నింటినీ RIHLA అనే గ్రంథంలో నిక్షిప్తం చేశాడు. అందులో కూడా బాబర్‌ మసీదు కట్టించిన విషయం లేదు.
ఆనాటి గ్రంథాలలో ఎక్కడా బాబర్‌ హిం దూ దేవాలయం కూలగొట్టించాడని గానీ, అదే స్థలంలో మసీదు కట్టించాడని గానీ లేదు. అస లు ఆయన జీవిత కాలంలో ఆయోధ్యకు వెళ్ళనే లేదు. తన మంత్రులను గానీ. సైన్యాధికారు లను గానీ పంపి అక్కడ దేవాలయమేదీ కూల గొట్టించలేదు. మసీదు కూడా కట్టించ లేదు. అంతే సిర్సా-షూషురా నదుల సంగమానికి బాబర్‌ 28 మార్చి 1528 C.E న ఒకసారి వెళ్ళాడు. అది అవధ్‌ ప్రాంతం. అక్కడికి అయోధ్య 72 మైళ్ళ దూరంలో ఉంది, వీరి విషయాలు అలా ఉంచి – రామ భక్తుడు ‘రామ్‌ చరిత్‌ మానస్‌’ రాసిన కవి పుంగవుడు తులసీదాస్‌, రామ మందిరాన్ని తురుష్కరాజులు కూలగొ డితే ఊరుకుంటాడా? వళ్ళు మండి తన ఆక్రో శాన్ని భక్తిపూర్వకంగా ఆ రాముడికి నివేదించు కోవాలి కదా? నివేదించుకోలేదు- ఆయనే మైనా వేరే విషయాలు రాశాడా? లేదే – కేవ లం రామచరిత్‌ మానసే రాశాడు. అలాంట ప్పుడు తన కాలంలో జరిగిన రామాలయ వి ధ్వంసం గురించి రాయకుండా ఉంటాడా? ఉండడుకదా? వీటన్నిటి సారాంశం ఏమిటంటే అయోధ్యలో బాబర్‌ అనే ముస్లిం రాజు హిం దూ దేవాలయాన్ని కూలగొట్టించ లేదు. అదే స్థలంలో తన పేరుతో మసీదు కట్టించలేదు -ఇది స్పష్టం! ఈ పరిశీలనల్లో ఒక ఫలకం కూడా దొరికింది. దాని మీద బాబర్‌ ఆదేశాల మేరకు ఆయన కమాండర్‌ మీర్‌ బాఖీ (బాఖీ తష్కండి) బాబ్రీ మసీదు కట్టించాడని ఉంది. అంతేగాని దాని మీద హిందూ దేవాలయం కూల్చి కట్టాడని లేదు. నిపుణులు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తేల్చిం దేమంటే ఆ ఫలకం 16వ శతాబ్దం నాటిది కాదని అందులోని భాష శైలి ఆధునిక కాలానికి చెందిందని – 19వ శతాబ్దంలో ఎవరో రాసి పెట్టిందని తేల్చారు. దానితో ఆ చిన్న ఆధారం కూడా పరిక్షకు నిలబడలేదు.
సరే మరి, ఎవరూ కట్టించకపోతే అయోధ్యలో మసీదు ఎలా వచ్చిందీ? అనే అనుమానం సహజంగా వస్తుంది. మరింత విస్తృత పరిశోధనల తర్వాత మరి కొన్ని విషయాలు బయటికొచ్చాయి. చరి త్రకారుడు సశీల్‌ కుమార్‌ ‘ద డిస్పూటెడ్‌ మాస్క్‌’ అనే పేరుతో తన పరిశోధనలు గ్రంథస్థం చేశాడు. రొమిల్లా థాపర్‌, కునాల్‌ చక్రవర్తి, సుదిర జైస్వాల్‌ వంటి ప్రసిద్ధ్ద చరిత్ర కారులు కూడా ఈ విషయాలు చర్చించారు. అయోధ్య బాబ్రీ మసీదును మొదట ‘జామా మసీదు’ అనే పిలిచేవారు. చాలాకాలం దానికి అ పేరే వాడుకలో ఉంది. 1855 తర్వాతే దాన్ని బాబ్రీమసీదు అనడం ప్రారంభించారు. పురాతన నిర్మాణాలు బాగా అధ్యయనం చేసిన నిపుణులు నిర్ధారించిందేమంటే -14-15 శతాబ్దాల మధ్య కాలంలో దాన్ని జోన్‌పూర్‌ షర్కీ రాజులు కట్టించారని! వారు కట్టించిన ఇతర మసీదుల గోపురాలు, లోపలి దూ లాలు, స్థంభాలు, గోడల నిర్మాణం ప్రవేశద్వారం (ఆర్చ్‌) వగైరా క్షుణ్ణం గా పరిశీలించిన తర్వాత వారు ఆ నిర్ణయానికి వచ్చారు. ఈ ‘బాబ్రీ మసీదు’ జోన్‌పూర్‌ షర్కీ రాజులు కట్టించిన షాహీ అటల మసీదుకు పూర్తి నకలు (డూప్లికేట్‌ నమోనా)గా ఉంది. అందువల్ల తెలుసుకోదగ్గ విషయమేమంటే బాబర్‌కు బాబ్రీ మసీదుకు ఎలాంటి సంబంధంలే దని! ఇలాంటి చారిత్రక విషయాలు తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానం తో రాజకీయాలు చేయాలన్న కుట్రతో ఎందరో ఎన్నో మాట్లాడారు. ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే అవన్నీ అబద్దాలు.
అయోధ్యను పూర్వం సాకేత్‌ అని పిలిచేవారు. సాధారణ శకం 5వ శతాబ్దంలో స్కందగుప్తుడు దాని కి అయోధ్య అని పేరు పెట్టాడు. 1818 జ.జు లో ఫైజాబాద్‌ జిల్లాకు సంబంధించిన అధికారి దారే ఫరా బక్ష్‌ ఒక డాక్యుమెంట్‌ విడుదల చేశా డు. అందులో గూడా హిందూ దేవా లయ-బాబ్రీ మసీదుల ప్రసక్తి లేదు. 1979-80లలో ఆర్కియాలజిస్ట్‌ బి.బి.లాల్‌ ఆయోధ్య ప్రాంతంలో విస్తృతంగా తవ్వకాలు నిర్వహించాడు. ఆయన ఉద్దేశమేమంటే, వాల్మికి రామాయణంలోని వర్ణనల ప్రకారం అక్కడ ఆధారాలేమైనా దొరుకుతాయే మోనని! వాల్మికి రామాయణాన్ని నిరూపించాలన్న పట్టుదలతో చాలా కష్టపడ్డారు. రామాయణంలో వాల్మికి వర్ణించిన ప్రదేశాలు, రాముడికి- సీతకు సంబంధించిన వస్తువులు, వారున్న ఇల్లు వంటి వాటి ఆధారాలు తవ్వి తీద్దామని ఆరాటపడ్డాడు. కానీ ఫలితం దక్కలేదు. సాధారణ శకానికి పూ ర్వం 8వ శతాబ్దం నుండి కొన్ని ఆధారాలు లభించాయే గాని-అవి దేవుడైన రాముడికి సంబంధించి నవి కావు. అంత శ్రమకోర్చి చేసిన పనిని బి.బి.లాల్‌ గ్రంథస్థం చేయలేదు. ఆయన అనుకున్నది దొరకనందుకు బహుశా ఆయనకే నామోషీగా తోచిందేమో-‘Nothing of speciel Interest-was found’- అని చెప్పుకున్నాడు. ఇండియన్‌ ఆర్కియాలజీ రివ్యూ జర్నల్‌ రెండు సంచికల్లో ఆయన కృషిని కొంత నమోదు చేసింది. అందులో Nothing అనే ఉంది. 1969-70 ప్రాంతంలో బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ బృందం అయోధ్యలో కొంత అధ్యయనం చేసింది గానీ కొత్త సమాచారం ఏదీ ఇవ్వలేక పోయింది.
సర్వే ఆఫ్‌ ఇండియా : భారతదేశపు తొలి డైరెక్టర్‌ జర్నల్‌ ఆఫ్‌ ఆర్కి యాలజీ అలెగ్జాండర్‌ కన్నింగ్‌హం దేశవ్యాప్తంగా తవ్వకాలు జరిపిం చాడు. ఎక్కడ తవ్వినా బౌద్దానికి సంబంధించిన శిల్పాలు, స్థూపాలు బయటపడసాగాయి. 1862-63 C.Eలో అయోధ్యలో కూడా తవ్విం చాడు. అక్కడ రెండు బౌద్ధ స్థూపాలు విశాలమైన ఒక బౌద్ధ విహారం బయటపడ్డాయి. వాటిని పరిశీలించి అవి మౌర్య చక్రవర్తి అశోకుడి కాలంవి అని ఆయన నిర్దారించాడు. వాస్తవానికి సాకేత్‌/అయోధ్య ఒక గొప్ప బౌద్ధ క్షేత్రంగా వెలసిల్లిందని చీనా యాత్రికుడు హ్యూన్‌త్సాంగ్‌ చెప్పింది కూడా అదే! 300-400 C.E మధ్య వెలువడిన బౌద్ధ జాతక కథల ప్రకారం- దశరధుడి, ఆయన కుమారుడు శ్రీరామచంద్రుల రా జధాని ఆయోధ్య కానేకాదు. వారి రాజధాని వారణాసి! 5-8 C.E శతాబ్దాల మధ్య మొదటి/ పద్నాలుగవ జైన తీర్థంకరుల జన్మస్థానం అయోధ్య! ఇక 1853-55 C.E ప్రాంతంలో వైష్ణవ భక్తుడు హను మాన్‌ ఘడీ బైరాగి-బాబ్రీ మసీదు ఉన్న స్థలమే శ్రీరాముడి జన్మస్థల మని ప్రచారం ప్రారంభించాడు. 1979 C.Eలో అఖిల భారతీయ రామాయణ మహాసభ వారు వారం రోజులపాటు ఆయోధ్యలో రామా యణ పారాయణం జరిపించారు. ఆ తరువాత రాముడి – సీత విగ్ర హాలు బాబ్రీ మసీదులో పెట్టి వివాదాన్ని పెంచారు. ఆ తర్వాతే పిటి షన్లు – కోర్టు కేసులు ఉధృతమయ్యాయి. నిప్పు లేనిదే పొగరాదు అని అంటారుగానీ, బ్రాహ్మణవాదం తల్చుకుంటే నిప్పు లేకుండానే పొగ పు ట్టించి దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయగలదు. ఇదిగో ప్రత్యక్షంగా చూశాం!
ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే వాల్మికి సృష్టించిన కల్పిత పాత్ర రా ముడు చారిత్రక పురుషుడే కాదు. అతను ఈ దేశంలో పుట్టడమేమిటీ? పుడితే గిడితే వాల్మికి మెదడ్లో పుడతాడు కదా? అబద్దాల పునాది మీద నడుస్తున్న ప్రస్థుత కేంద్ర ప్రభుత్వం అబద్ధాల పైనే అయోధ్య రామా లయం నిర్మిస్తోంది. ఈ బాయిస్‌(B)22జనవరి (J) ప్రాణప్రతిష్ట(P) ప్రభుత్వం ఒక చీకటిలోంచి మరో చీకటిలోకి ప్రవేశించినట్టు 6/12/ 1992 నుండి 22/1/2024లోకి ప్రవేశించింది! ఎవరి విశ్వాసాలు వారివి. నేను కేవలం నాకు దొరికిన చారిత్రక ఆధారాలు ప్రజల ముందు పెట్టాను. నమ్మడం నమ్మక పోవడం – వారి ఇష్టం!

– సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త : మెల్బోర్న్‌ నుంచి

– డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love