బాబర్‌, ఇఫ్తికార్‌ సెంచరీలు

– నేపాల్‌పై 238పరుగుల తేడాతో పాకిస్తాన్‌ గెలుపు
– ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీ
ముల్తాన్‌(పాకిస్తాన్‌): ఆసియా కప్‌ 2023లో పాకిస్తాన్‌ జట్టు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన గ్రూప్‌-ఏ తొలి లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు 238పరుగుల తేడాతో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(151) రికార్డు సెంచరీకి తోడు ఇప్తికార్‌(109నాటౌట్‌) శతకంతో కదం తొక్కాడు. పాకిస్తాన్‌ జట్టు 124పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ వీరిద్దరూ కలిసి 5వ వికెట్‌కు 218పరుగులు జతచేశారు. ఛేదనలో నేపాల్‌ జట్టు 23.4ఓవర్లలో 104పరుగులకు ఆలౌటైంది. షాదాబ్‌కు నాలుగు, షాహిన్‌, రవూఫ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బాబర్‌కు లభించగా.. నేడు శ్రీలంక-బంగ్లాదేశ్‌ల మధ్య మ్యాచ్‌ జరగనుంది.
రికార్డుల బాబర్‌…
పాకిస్తాన్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ నేపాల్‌పై సెంచరీ చేసి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. నేపాల్‌పై బాబర్‌ అజామ్‌ 109బంతులు ఆడి 10 బౌండరీల సాయంతో కెరీర్‌లో 19వ సెంచరీని నమోదు చేశాడు. దాంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో డేవిడ్‌ వార్నర్‌(19 సెంచరీలు) రికార్డును సమం చేశాడు. సయీద్‌ అన్వర్‌(20) తర్వాత పాక్‌ తరఫున అత్యధిక వన్డే శతకాలు బాధిన పాకిస్తాన్‌ ఆటగాడిగానూ నిలిచాడు. అలాగే అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సష్టించాడు. బాబర్‌కు 19సెంచరీలు సాధించేందుకు కేవలం 102 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్‌ ఆమ్లా (104 ఇన్నింగ్స్‌ల్లో) పేర ఉన్న రికార్డును చెరిపేసాడు.
స్కోర్‌బోర్డు..
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఫకర్‌ జమాన్‌ (సి)ఆసిఫ్‌ (బి)కరణ్‌ 14, ఇమామ్‌ (రనౌట్‌) 5, బాబర్‌ (సి)సందీప్‌ (బి)సోంపాల్‌ 151, రిజ్వాన్‌ (రనౌట్‌) దిపేంద్ర 44, అఘా సల్మాన్‌ (సి)కుశాల్‌ బుర్టెల్‌ (బి)లమిఛ్ఛెనె 5, ఇప్తికార్‌ (నాటౌట్‌) 109, షాదాబ్‌ (బి)సోంపాల్‌ 4, అదనం 10. (50 ఓవ్లలో 6వికెట్ల నష్టానికి) 342పరుగులు.
వికెట్ల పతనం: 1/21, 2/25, 3/111, 4/124, 5/338, 6/342
బౌలింగ్‌: సోంపాల్‌ 10-1-85-2, కరణ్‌ 9-0-54-1, గుల్షన్‌ 4-0-35-0, రాజ్‌పన్సి 10-0-48-0, లమిచ్ఛెనె 10-0-69-1, దేశ్‌పాండే 6-0-40-0, కుశాల్‌ 1-0-10-0
నేపాల్‌ ఇన్నింగ్స్‌: కుశాల్‌ (సి)రిజ్వాన్‌ (బి)షాహిన్‌ అఫ్రిది 8, ఆసిఫ్‌ (సి)ఇప్తికార్‌ (బి)నసీమ్‌ 5, రోహిత్‌ (ఎల్‌బి)షాహిన్‌ అఫ్రిది 0, ఆరిఫ్‌ (బి)హరీస్‌ రవూఫ్‌ 26, సోంపాల్‌ (సి)రిజ్వాన్‌ (బి)రవూఫ్‌ 28, గుల్షాన్‌ (సి)ఫకర్‌ జమాన్‌ (బి)షాదాబ్‌ 13, దిపేంద్ర (బి)నవాజ్‌ 3, కుశాల్‌ మల్లా (సి)ఇప్తికార్‌ (బి)షాదాబ్‌ 6, సందీప్‌ (బి)షాదాబ్‌ 0, కరణ్‌ (నాటౌట్‌) 7, లలిత్‌ (ఎల్‌బి)షాదాబ్‌ 0, అదనం 8. (23.4ఓవర్లలో ఆలౌట్‌) 104పరుగులు.
వికెట్ల పతనం: 1/10, 2/10, 3/14, 3/73, 5/82, 6/90, 7/91, 8/91, 9/104, 10/104
బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 5-0-27-2, నసీమ్‌ షా 5-0-17-1, రవూఫ్‌ 5-1-16-2, షాదాబ్‌ 6.4-0-27-4, నవాజ్‌ 2-0-13-1.

Spread the love