అంతర్జాతీయ క్రికెట్‌కు వాహబ్‌ రియాజ్‌ గుడ్‌బై

కరాచీ: అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్తాన్‌ ఎడమచేతివాటం పేసర్‌ వాహబ్‌ రియాజ్‌ వీడ్కోలు పలికాడు. ట్విటర్‌ వేదికగా వహాబ్‌ రియాజ్‌.. అద్భుతమైన ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నా. అంతర్జాతీయ క్రికెటర్‌గా నా ఎదుగుదలకు కృషి చేసిన పాకిస్తాన్‌ క్రికెట్‌బోర్డుకు, నా కుటుంబం, కోచ్‌లు, మెంటార్స్‌, సహచర ఆటగాళ్లు.. నాకు అండగా నిలిచిన అభిమానులు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నా.. రెండేళ్లుగా రిటైర్మెంట్‌ గురించి ఆలోచిస్తున్నా. నా దేశం తరఫున శక్తివంచన లేకుండా ఆడా’ అని పేర్కొన్నాడు. 2010 ఆగస్టులో ఇంగ్లండ్‌తో ఓవల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన రియాజ్‌ 2020 డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్‌ ఆడాడు.

Spread the love