25న వైద్య గర్జన సన్నాహక సభ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రాథమిక సభ్యుల వైద్యగర్జన సన్నాహక సభ ఈ నెల 25న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌ లోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ అలుమ్ని బిల్డింగ్‌లో సమావేశమయ్యారు. ప్రభుత్వ వైద్యుల పెండింగ్‌ సమస్యలు -.వాటి పరిష్కార మార్గాల కోసం భవిష్యత్‌ కార్యాచరణ, వైద్యగర్జన సభపై వారు చర్చించారు. అన్ని విభాగాల్లో ఉన్న వైద్యులంతా ఒక్కటిగా ముందుకు వచ్చి సూచనలు, సలహాలివ్వాలని సమావేశం కోరింది. అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయాలతో ఐక్యంగా ముందుకెళ్లాలని తీర్మానించింది.

Spread the love