బెయిలివ్వండి

బెయిలివ్వండి– ఎన్నికల ప్రచారానికి వెళ్లాలి
– ఢిల్లీ కోర్టులో మనీశ్‌ సిసోడియా పిటిషన్‌
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్‌ కీలక నాయకుడు మనీశ్‌ సిసోడియా మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. సిసోడియా పిటిషన్‌ను స్వీకరించిన సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టు.. దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆయన అభ్యర్థనపై స్పందనలు తెలియజేయాలని ఆదేశించింది. అనంతరం బెయిల్‌ పిటిషన్‌ విచారణను న్యాయస్థానం ఈనెల 20కి వాయిదా వేసింది. ఢిల్లీలోని మద్యం స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సైతం ఆయనను కస్టడీలోకి తీసుకున్నది. అప్పటి నుంచి ఆయన తీహార్‌ జైల్లో ఉన్నారు. ఈ కేసుల్లో బెయిల్‌ కోరుతూ ఆయన పలుమార్లు పిటిషన్లు దాఖలు చేసిన ప్పటికీ న్యాయస్థానాల్లో ఊరట లభించలేదు. కాగా, ఇదే కేసులో ఆప్‌ నేత ఎంపీ సంజరుసింగ్‌కు బెయిల్‌ లభించటం, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు రావటంతో బెయిల్‌ లభించొచ్చనే ఆశలో మనీశ్‌ ఉన్నట్టు తెలుస్తున్నది.

Spread the love