నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లోని ఈద్గాల వద్దకు వెళ్లి ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండల కేంద్రం శివారులోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా కమ్మర్ పల్లి మజీద్ కమిటీ అధ్యక్షులు అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ త్యాగానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తుందని తెలిపారు. కుల మతాలకతీతంగా ప్రజలంతా సోదర భావంతో మెలగాలని ఆకాంక్షించారు. మండలంలోని ఉప్లూర్ లో బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి, సర్పంచ్ ఎనుగందుల శైలేందర్, ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ నరేష్, తదితరులు
శుభాకాంక్షలు తెలిపారు.



