త్యాగాలకు ప్రతీక బక్రీద్‌

నవతెలంగాణ -ఆలేరుటౌన్‌
సమిష్టి ప్రయోజనం కోసం, వ్యక్తిగత స్వార్థాన్ని విడిచి త్యాగాలకు సిద్ధపడ్డప్పుడే సమాజ హితం జరుగుతుందని,త్యాగాలకు ప్రతీక బక్రీద్‌ పండుగ అని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎంఎల్‌ఏ గొంగిడి సునితమహేందర్‌ రెడ్డి అన్నారు. బక్రీద్‌ సందర్భంగా పట్టణంలో గురువారం ముస్లింలకు ప్రభుత్వ విప్‌ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందన్నారు. మైనారిటీ అభివద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని వివరించారు. ప్రార్థనలు ఆలేరు పట్టణంలో ముస్లిం సోదరులు బక్రీద్‌ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం అలైబాలాయి తీసుకున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఆలేరు మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ కుడుదుల నగేష్‌, బూడిద బిక్షమయ్య గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి ,టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శిలు జనగాం ఉపేందర్‌ రెడ్డి ,బీర్ల ఐలయ్యలు, ఆలేరు మున్సిపల్‌ చైర్మెన్‌ వస్పరి శంకరయ్యలు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. భువనగిరి : జిల్లాలో బక్రీద్‌ పండుగను ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలతో గురువారం నిర్వహించారు. పలు పార్టీలు ముస్లిం సోదరులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. సమిష్టి ప్రయోజనం కోసం వ్యక్తిగత స్వార్థాన్ని విడిచి త్యాగాలకు సిద్ధపడ్డప్పుడే సమాజ హితం జరుగుతుందని,త్యాగాలకు ప్రతీక బక్రీద్‌ పండుగ అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి అన్నారు. బక్రీద్‌ పర్వదినం పురస్కరించుకొని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల మత విశ్వాసాలను సాంప్రదాయాలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన కొనసాగుతుందని చెప్పారు.సర్వమత సౌభ్రాతత్వమే భారతదేశండీసీసీి అధ్యక్షులు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డిసర్వమత సౌభ్రాతత్వమే భారతదేశమని డీసీసీ అధ్యక్షులు కుంభ అనిల్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. గురువారం భువనగిరి ఈద్గా వద్ద మైనార్టీలను సోదరులు కలిసి అలై బలాయి తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మతాలకతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు బీస్కుట్ల సత్యనారాయణ నాయకులు అవేస్‌ చిస్తి పాల్గొన్నారు.చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ మండల, మున్సిపాలిటీలో గురువారం ముస్లింలు బక్రీద్‌ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణకేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిమ్‌లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అలరు బలరు తీసుకుంటూ ఒకరికొకరు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. టీపీసీసీ ప్రధానకార్యదర్శి చలమల్ల కష్ణారెడ్డి, కాంగ్రెస్‌పార్టీ బ్లాక్‌, మున్సిపల్‌, మండల అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నర్సింహాగౌడ్‌, బోయ దేవేందర్‌, వివిధ పార్టీల నాయకులు ముస్లిమ్‌ సోదరులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love