అందుబాటులో అన్ని రకాల రసాయన ఎరువులు

– సింగిల్‌విండో చైర్మె చింతల దామోదర్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్‌చౌటుప్పల్‌
మండలంలోని ఎస్‌.లింగోటం గ్రామంలోని పీఏసీఎస్‌ సంఘ భవనంలో అన్ని రకాల రసాయన ఎరువులు అందుబాటులో ఉన్నాయని చౌటుప్పల్‌ సింగిల్‌విండో చైర్మెన్‌ చింతల దామోదర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఎస్‌.లింగోటం గ్రామంలోని ఎరువుల గోదాం, సంఘం మరమ్మతుల భవనం, ప్రహరీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సీడీపీ నిధులు పది లక్షలతో సంఘం భవనానికి మరమ్మత్తులు, ప్రహరీ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రాంత రైతులకు ఎరువులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సంఘం భవనంలో ఎరువుల అమ్మకాలు ప్రారంభించామన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు చెన్నగోని అంజయ్యగౌడ్‌, సర్పంచ్‌లు ఆకుల సునీతశ్రీకాంత్‌, చౌట వేణుగౌడ్‌, ఎంపీటీసీ తడక పారిజాతమోహన్‌, సింగిల్‌విండో మాజీ చైర్మెన్‌్‌ చీరిక సంజీవరెడ్డి, డైరెక్టర్లు గుండెబోయిన రూపమ్మ, దూర్క కష్ణ, పబ్బతి వెంకటయ్య, బోరెం నర్సిరెడ్డి, బాతరాజు సాయిలు, దుబ్బాక శశిధర్‌రెడ్డి, దౌడి బాలరాజు, పానుగోతు సూర, కోరమండల్‌ కంపెనీ ఎమ్‌డి లక్ష్మణ్‌, ఢిల్లీ మాధవరెడ్డి, సీఈఓ రమేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Spread the love