నవతెలంగాణ- తిరుమలగిరి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైఅనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని తిరుమలగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరాల వీరేష్ అన్నారు. మంగళవారం తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరాల వీరేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. అనంతరం ఈ సందర్భంగా పేరాల వీరేష్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ నాయకులు ప్రజల సొమ్మును పందికొక్కుల్లా అక్రమంగా తిని, ఈరోజు కండ కావరంతో కల్వకుంట్ల బానిస కుక్క బాల్క సుమన్ రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందన్నారు. అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా అవాకులు చవాకులు పేలిన నిన్ను తెలంగాణలో ఎక్కడ దొరికిన బట్టలు ఊడదీసి కుక్కను కొట్టినట్టు కొడతామని హెచ్చరించారు. సభ్యత సంస్కారం లేని నీలాంటి తొత్తుల వల్లనే రాజకీయాలలో విలువలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బాల్క సుమన్ తన మాటలను వెనక్కి తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపినా కూడా బీఆర్ఎస్ నాయకులు బలుపుగా ప్రవర్తించడం సిగ్గుచేటు అన్నారు.
భవిష్యత్తులో ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు అసత్య ఆరోపణలు చేస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ మూల అశోక్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమీలాల్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల మూల రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుంకరి జనార్ధన్, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ ప్రేమ్ ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్ల సోమ నరసయ్య, దాచేపల్లి వెంకన్న,కౌన్సిలర్లు బత్తుల శ్రీను, గుగులోతు భాస్కర్, సరళ యాదవ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి లింగయ్య, సుధాకర్, వార్డ్ ఇన్చార్జులు పత్తేపురం సుధాకర్, దొంతర బోయిన నరసింహ, గడ్డి దిలీప్, కాంగ్రెస్ నాయకులు బోండ్ల వంశి, కందుకూరు రమేష్, పానుగంటి గణేష్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుర్ర శ్రీను, కప్పల రాకేష్, మహేష్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.