తాడ్వాయి మండల ఐఎన్ టియుసి మండల అధ్యక్షులుగా బండారి శ్రీనివాస్

నవతెలంగాణ -తాడ్వాయి
మండల కేంద్రానికి చెందిన బండారి శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆదేశాల మేరకు ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి వారం రోజున మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేవేందర్ ఆధ్వర్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షులు బండారి శ్రీనివాస్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను నియమించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మండలాధ్యక్షుడు బొల్లు దేవేందర్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతుగా సాయి శక్తులకు కృషి చేస్తానని అన్నారు. శ్రామిక కార్మిక వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు అర్రెం లచ్చు పటేల్, స్థానిక సర్పంచి ఇర్ప సునీల్ దొర, గోవిందరావుపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ యానాల సిద్ధి రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు లంజపెల్లి నరసయ్య నాయకులు పాల్గొన్నారు
Spread the love