మండల పరిషత్ నూతన అభివృద్ధి అధికారిగా బండి లక్ష్మప్ప బుధవారం బాధ్యతలు చేపట్టారు.వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తించిన బండి లక్ష్మప్ప మండలానికి ఎంపీడీఓగా ఇటీవల బదిలీ అయ్యారు.నూతన ఎంపీడీఓకు సూపరిండెంట్ అంజయ్య,ఎంపీఓ విష్ణు వర్ధన్,మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ సిబ్బంది ఘన స్వాగత పలికారు.
ప్రత్యేకాధికారిగా బాధ్యతలు: మండల కేంద్రంతో పాటు తోటపల్లి,కల్లెపల్లి గ్రామాలకు మండల ఎంపీడీఓ ప్రత్యేకాధికారిగా నియమాకమైన విషయం తెలిసిందే.మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీడీఓ బండి లక్ష్మప్ప సూపరిండెంట్ అంజయ్య,ఎంపీఓ విష్ణు వర్ధన్ తో కలిసి సందర్శించి ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి,పంచాయతీ సిబ్బంది ఎంపీడీఓకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.అనంతరం శాలువా కప్పి సన్మానించారు.