ఆయిల్ ఫాం సాగుతో రైతుకు బరోసా

– రైతులకు అవగాహన కల్పిస్తున్న ఆయిల్ఫెడ్ డి.ఒ బాలక్రిష్ణ
– ఫాం ఆయిల్ క్షేత్రాలను సందర్శించిన జగిత్యాల రైతులు
నవతెలంగాణ – అశ్వారావుపేట: ఆయిల్ ఫాం సాగుతో రైతు బరోసా ఉంటుందని,అంతర పంట తో అదనపు ఆదాయం పొందవచ్చని ఆయిల్ఫెడ్ డి.ఒ ఆకుల బాలక్రిష్ణ ఔత్సాహిక రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యాన – పట్టుపరిశ్రమ శాఖ, లోహియా ఎడిబుల్  ఆయిల్ సంయుక్తంగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి, ఇబ్రహింపట్నం, కొడిమ్యాల, మల్యాల మండలాలకు చెందిన ఔత్సాహిక రైతులను ఈ ప్రాంతంలో ఆయిల్ ఫాం సాగు స్థితిగతులను అధ్యయనం చేయడానికి కి రైతుల విజ్ఞాన యాత్ర పేరుతో బుధవారం స్థానిక ఆయిల్ ఫాం క్షేత్రాలను, పరిశ్రమలను సందర్శించారు. ఈ సందర్భంగా డి.ఒ బాల క్రిష్ణ ఆయిల్ ఫాం సాగు పుట్టుపూర్వోత్తరాలు,ఫాం ఆయిల్ సాగు కు ఆయిల్ఫెడ్, ఉద్యాన శాఖల ప్రోత్సాహకాలు, సాగులో యాజమాన్య పద్ధతులను, వంటలు వాడకంలో ఫాం ఆయిల్ ప్రాధాన్యతను సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎ.ఇ.ఒ భువనేశ్వర్, ఎఫ్.ఒ రాహుల్, స్థానిక నర్సరీ ఇంచార్జి మహేష్,ఎఫ్.ఒ దాసరి చందు(చిన్ని) లు పాల్గొన్నారు.

Spread the love