గుంతల పూడికకు చర్యలు చేపట్టిన సర్పంచ్ రమణ సురేష్ గొండ
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో అంతర్గత రోడ్లు అద్వానంగా ఉండటంతో సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ కు తెలియజేశారు. వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ స్పందించి గ్రామస్తుల కోరిక మేరకు జిపి నిధులతో ఆదివారం గ్రామంలోని ప్రతి వార్డులో ఉన్న గుంతలను పూడికలు , నీరు నిల్వ ఉండే విధులు, వర్షాలు పడినప్పుడు బురదమయంగా మారే విధులలో మోరంమట్టితో కప్పీ వేసి రోడ్ల పైన వెళ్లే వాహనాలు, ఎడ్లబండ్లు , పశువులకు, జీవాలకు, కాలినడకన వెళ్లే గ్రామ ప్రజలకు వారికి దారిని సుగుమం చేశారు. ఇక గ్రామంలో ఎక్కడ కూడా గుంతలు లేకుండా పూర్తిగా మట్టిని వేసి రోడ్లను నుతనంగా చేయడం జరిగిందని జిపి కార్యదర్శి భరద్వాజ్ అన్నారు. దీంతో గ్రామంలో ప్రజలు వర్షాకాలంలో నడవడానికి కష్టంగా ఉన్న ప్రాంతాలలో కూడా ప్రస్తుతం పెళ్లెందుకు సునాయాసంగా తయారవడం తో పాఠశాలకు వెళ్ళే చిన్నపిల్లలైన విద్యార్థులకు సమస్యలు లేకుండా పోయిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
బస్వాపూర్ గుంతల రోడ్లకు మహార్ధశ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



