Monday, July 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

- Advertisement -

నవతెలంగాణ-ఖిల్లా ఘణపురం
మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కాళికామాత ఆలయం నిర్మాణానికి బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిరిసాల సాయినాథ్ ఆదివారం ఆలయ కమిటీ నిర్వాహకులకు రూ .51 వేలను విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాలు భక్తి సామరస్యానికి ప్రతికలుగా నిలుస్తాయని అన్నారు. అదేవిధంగా కాళికామాత ఆలయ విశిష్టతను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం మండల నాయకులు సిరిసాల సాయినాథ్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు బుచ్చిబాబు గౌడ్, నాయకులు బాలాంజనేయులు గౌడ్, ఆశన్న, సత్యనారాయణ, బెస్త యాదగిరి, రామచందర్, వెంకటేష్, శ్రీను, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కమ్మరి ఆంజనేయులు చారి, పులేందర్ చారి, వెంకటేష్, ప్రసాద్, రవి, సిద్దు, రమేష్, బ్రహ్మ చారి, ఆచారి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -