నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ, అరెల్ మైసమ్మ బోనాల వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ కర్రేవార్ సావిత్రి సాయ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలైన పోచమ్మ, అరెల్ మైసమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జుక్కల్ గౌడ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మొదటి ఆదివారం గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఊరు దేవతలకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, పోచమ్మ బోనాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతున్నదని తెలిపారు.
అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో , ఆరోగ్యంగా ఉండాలని, అష్టైశ్వర్యాలు ఆందించాలని , పశు సంపద పెంపొందించాలని గ్రామ దేవతలకు ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకుముందు గ్రామంలో గౌడ మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి వనభోజనాలు నిర్వహించారు. ముఖ్యంగా వర్షాలు గురువాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ సర్పంచ్ కర్రేవార్ సావిత్రి సాయగౌడ్, జుక్కల్ మాజీ ఉప సర్పంచ్ భాను గౌడ్, గౌడ్, కులస్తులు మారుతి గౌడ్, అంజ గౌడ్, రవి గౌడ్, కార్తీక్ గౌడ్, ఎల్.ఎన్. గౌడ్, కృష్ణ గౌడ్, మహేష్ గౌడ్, పాటు మహిళలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.



