ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను మెరుగైన సేవలు అందించాలి

Better services should be provided to patients coming to government hospitals– డాక్టర్  డి ఎం హెచ్ ఓ సుజాత 

నవతెలంగాణ – శంకరపట్నం
ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ సుజాత అన్నారు. మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిహెచ్‌సీ రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రి ఓపీని, వైద్యసేవలకోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించాల్సిన వైద్యసహాయంపై సిబ్బందికి పలు సూచనలు  చేశారు. హాస్పిటల్ లోని ల్యాబ్ ను, చికిత్స పొందుతున్న రోగులను వైద్య సేవలు సరిగా అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. అనంతరం విలేకరు సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం 13 ఏండ్ల వయసు పై ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు ఆస్పత్రిలోనే  చేయించుకొని డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లవద్దని ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రజలకు పరీక్షలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు నాయక్, వైద్యాధికారి శ్రవణ్ కుమార్,ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ సంధ్య,డాక్టర్ సన,ఏఎన్ఎంలు,ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love