భగవంత్‌ కేసరిగా బాలయ్య

నందమూరి బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న చిత్రానికి ‘భగవంత్‌ కేసరి’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ని గురువారం అనౌన్స్‌ చేశారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి ‘ఐ డోంట్‌ కేర్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. ఈ నేపథ్యంలో రిలీజ్‌ చేసిన టైటిల్‌ పోస్టర్‌కు సర్వత్రా అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే మేకర్స్‌ మరో బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చి అందర్నీ సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సినిమా టీజర్‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 10న విడుదల చేయనున్నారు. ఈ టీజర్‌ ప్రపంచవ్యాప్తంగా 108కి పైగా థియేటర్లలో ప్రదర్శితం కానుండటం విశేషం. ఇప్పటికే టైటిల్‌ పోస్టర్‌తో సంబరాలు మొదలయ్యాయి. స్పెషల్‌ డేట్‌లో వచ్చే టీజర్‌తో బాలయ్య అభిమానులు సందడి చేయనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణను అనిల్‌ రావిపూడి ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. యూనిక్‌ స్క్రిప్ట్‌తో, సరికొత్త యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. విజయదశమి కానుకగా (దసరా) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Spread the love