
– రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన స్థానిక విద్యార్ధిని భవ్యశ్రీ లక్ష్మి…
నవతెలంగాణ – అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా చెస్ అసోసియేషన్ వీ కింగ్స్ చెస్ అకాడమీ టోర్నమెంట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ వారి ఆధ్వర్యంలో సత్తుపల్లి మండలం బి.గంగారం లోని సాయి స్ఫూర్తి డి.ఎ.వి స్కూల్ ప్రాంగణంలో అండర్ 13 జిల్లా స్థాయి ఓపెన్ చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో సాయి స్ఫూర్తి డి.ఎ.వి స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ తణుకు శేష సాయి శ్రీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 150 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో అశ్వారావుపేట కు చెందిన కేశిబోయిన భవ్యశ్రీ లక్ష్మి తృతీయ స్థానంలో నిలిచి బహుమతిని సాధించింది అన్నారు. వీరు ఈ నెల 10 వ తారీకు న హైదరాబాద్ లాల్ బహుదూర్ స్టేడియం లో రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీ లో పాల్గొంటున్నారని తెలిపారు.