నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి భూముల సమగ్ర రి సర్వే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని మల్లంపల్లి, చిగురుపల్లి, వల్లెంకుంట గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో రెవెన్యూ గ్రామాల భూముల పరిశీలనలో భూభారతి రీ-సర్వే అవగాహన గ్రామసభలు సర్పంచ్ల అధ్యక్షతన నిర్వహించారు. మండల తహసీల్దార్ రవికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ సర్వే, బౌం డరీ యాక్ట్ 1923ను అనుసరించి రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డుల శాఖ అధికారులు ప్రతీ సర్వే నంబర్ భూమిని రీ-సర్వే చేపడతారన్నారు. హద్దులను గుర్తించి భూములను క్షేత్ర స్థాయి పరిశీలన, విచారణ, ట్రిబ్యునళ్ల ద్వారా భూసమస్యల పరిష్కారం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం రెవెన్యూ గ్రామాల సరిహద్దు రాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు రాములు, చంద్రగిరి సంపత్, బొమ్మ రజిత, వార్డుసభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య రైతులు,ప్రజలు పాల్గొన్నారు.
భూభారతి రీ-సర్వే అవగాహన గ్రామసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



