దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని భువనేశ్వరి పీఠము స్వామి వారు శుక్రవారం దర్శించుకున్నారు. శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి వారు భువనేశ్వరి పీఠము స్వామి వారికి ఆలయ పండితులు స్వస్తితో స్వాగతం పలికారు. పీఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈ ఓ వినోద్ రెడ్డి వారికి స్వామి వారి కళ్యాణ మండపంలో ప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఏ ఈ ఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్, ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య, నరసింహ చారి, యదులాపురపు శివ ఉన్నారు.