వాట్సాప్‌ యూజర్లకు బిగ్ అలెర్ట్‌.. ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా అత్యధికం వినియోగిస్తున్న యాప్‌లలో వాట్సాప్‌ ఒకటి. మోటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను తీసుకువస్తున్నది. అదే సమయంలో యూజర్ల సెక్యూరిటీకి పెద్దపీట వేస్తుంది. అయితే, కొత్త వెర్షన్‌ డెవలప్‌ చేస్తుండడంతో పాత వర్షన్లకు అనుకూలంగా లేని మొబైల్స్‌కు వాట్సాప్‌ సేవలను నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెద్ద ఎత్తున మొబైల్స్‌కు సర్వీసులను బంద్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 35 మోడల్స్‌కు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను కెనాల్‌టెక్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో ఆపిల్‌, శామ్‌సంగ్‌తో పాటు పలు కంపెనీలకు చెందిన మోడల్స్‌ ఉన్నాయి. త్వరలోనే ఆయా మోడల్స్‌లో వాట్సాప్‌ పని చేయదని.. ఆయా యూజర్లు కొత్త ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు అప్‌డేట్‌డ్‌ మొబైల్స్‌కు మారాలని సూచించింది. అయితే, ఎప్పటి నుంచి ఈ సర్వీసులు నిలిచిపోతాయన్నది మాత్రం వెల్లడించలేదు. ఇందుకు సందేశాలను పంపనున్నట్లు సమాచారం. ఆ తర్వాత నుంచి సేవలను నిలిచిపోతాయని తెలిపింది.
వాట్సాప్‌ పని చేయని మోడల్స్ ఇవే..
యాపిల్‌ : ఐఫోన్‌-5, ఐఫోన్‌-6, ఐఫోన్‌-6ఎస్‌, ఐఫోన్‌-6 ఎస్‌ ప్లస్‌, ఐఫోన్‌-ఎస్‌ఈ మోడల్స్‌ ఉన్నాయి.
శాంసంగ్‌ : గెలాక్సీ ఏస్‌ ప్లస్‌, గెలాక్సీ కోర్‌, గెలాక్సీ ఎక్స్‌ప్రెస్‌ 2, గెలాక్సీ గ్రాండ్‌, గెలాక్సీ నోట్‌ 3, గెలాక్సీ-ఎస్‌3 మినీ, గెలాక్సీ-ఎస్‌4 యాక్టివ్‌, గెలాక్సీ ఎస్‌4 మినీ, గెలాక్సీ ఎస్‌4 జూమ్‌ మోడల్స్‌లో వాట్సాప్‌ పని చేయదు.
మెటోరోలా : ఈ కంపెనీ నుంచి మోటో జీ, మోటో ఎక్స్‌ మోడల్స్‌కు సర్వీసులు నిలిపివేయబోతున్నది.
హువావే : ఎసెండ్‌ పీ6ఎస్‌, ఎసెండ్‌ జీ525, హువావే సీ199, హువావే జీఎక్స్‌1 ఎస్‌, హువావే వై625 మోడల్స్‌లో వాట్సాప్‌ పని చేయదు.
లెనోవా : లెనోవా 46600, లెనోవా ఏ858టీ, లెనోవా పీ70, లెనోవా ఎస్‌890లో వాట్సాప్‌ నిలిచిపోనున్నది.
సోనీ: ఎక్స్‌పీరియా జెడ్‌1, ఎక్స్‌పీరియా ఈ3 మోడల్స్‌ ఉన్నాయి.
ఎల్‌జీ : ఆప్టిమస్‌ 4ఎక్స్‌ హెచ్‌డీ, ఆప్టిమస్‌ జీ, ఆప్టిమస్‌ జీ ప్రో, ఆప్టిమస్‌ ఎల్‌7 మోడల్స్‌లో పని చేయదు.

Spread the love